- సహాయక చర్యలు వేగవంతం చేస్తాం
- హెల్త్ క్యాంపు లీజ్,శానిటేషన్ పై శ్రద్ధ పెట్టాం
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : వరద ఉధృత్తితో నిరాశ్రయులుగా మిగిలిన ప్రజలందరినీ ఆదుకుంటామని, ఎవరు ఆందోళన చెందోద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని వీడీఓఎస్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.48 గంటల్లోనే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా వరద విపత్తు వచ్చిందన్నారు. వందేళ్లలో ఎప్పుడు ఇంత వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు.
వరదలతో అనేక మంది ప్రజలు నిర్వాసితులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారులన్నీ నీళ్లతో నిండిపోయాయన్నారు. సహాయక చర్యలు కష్టతరంగా మారాయని, మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. ఆదివారం వరద ఉధృతిలో ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మందిని శతవిధాలా ప్రయత్నం చేసి కాపాడమన్నారు. మున్నేరు వరద కారణంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 10 డివిజన్లు వరదల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. వెంటనే హెల్త్ క్యాంపులు,శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెటామని చెప్పారు. బాధితులందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తామన్నారు. వరద బాధితులకు పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.
పొంగులేటి పర్యటన..
ఖమ్మం రూరల్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లోని బాధితులతో మాట్లాడి ఓదార్చారు. బాధితులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
బాధితుల పరామర్శించేదుకు బైక్పై వెళ్తున్న వెళ్తుండగా బైక్ స్కిడ్ అయి కిందపడిపోగా ఎడమకాలుకు స్వల్ప గాయమైంది. వెంటనే మంత్రిని భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీస్‌కు తరలించారు. జిల్లా ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర గౌడ్ ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు.