బడ్జెట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి కృషి

బడ్జెట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి కృషి
  •  ట్రస్మా రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రి తుమ్మల 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు బడ్జెట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్స్, ఇతర సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని చెప్పారు.  బుధవారం హైదరాబాద్​లో తెలంగాణ ప్రైవేటు రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా శివరాత్రి యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా ఐవీ రమణారావు, ట్రెజరర్​గా జయసింహాగౌడ్, ట్రస్మా చీఫ్ అడ్వైజర్ గా యాదగిరి శేఖర్ రావు ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరై  మాట్లాడారు. .