ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నగరంలోని 2, 5, 8, 27 49, 57వ డివిజన్లలో సీసీ రోడ్డు, సైడ్​ కాల్వల పనులు, ఖమ్మం-–కొదుమూరు రెండు లేన్ల ఆర్ అండ్ బీ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా చేస్తున్న పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

57వ డివిజన్​ వికలాంగుల కాలనీ వద్ద నగరపాలక సంస్థ సిబ్బందికి చెందిన సెప్టిక్ ట్యాంక్ క్లినింగ్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణ లాల్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.