తలసేమియా బాధితులకు సేవలందిస్తున్న  డాక్టర్​కు అభినందనలు : తుమ్మల నాగేశ్వరరావు 

తలసేమియా బాధితులకు సేవలందిస్తున్న  డాక్టర్​కు అభినందనలు : తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం టౌన్, వెలుగు : తలసేమియా చిన్నారులకు సేవలు అందించడం అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం లేక్ వ్యూ హాల్ లో సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో పెడియాట్రిక్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన ప్రపంచ తలసేమియా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మాట్లాడుతూ 3,500 ల మంది తలసేమియా చిన్నారులకు సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ ను అభినందించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫైర్ రవి, జబర్దస్తు ఫేమ్ మోగిలి, మాయాద్వీపం ఫేమ్ నాగేందర్, 24 వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు.
 
పలు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో..

ఖమ్మంలోని ప్రైవేట్ హోటల్ లో సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ రుడావత్ కిరణ్, ఆర్టీసీ సీనియర్ డాక్టర్ ఏవీ గిరిసింహారావు హాజరయ్యారు. తలసేమియా నిర్ములానకు కృషి చేయాలని కోరారు. సంస్థ బాధ్యురాలు పి. అనిత మాట్లాడుతూ 250 మంది చిన్నారులకు రక్తం, ఉచితంగా మెడిసిన్ అందిస్తున్నట్లు తెలిపారు.11 మంది కి బోన్ మ్యారో చికిత్స చేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేశ్​బాబు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి నారాయణ రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్  కిరణ్ కుమార్, డాక్టర్లు పాల్గొన్నారు.