ఖమ్మం, వెలుగు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఖమ్మం నగరంలో టూ వీలర్ పై పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ నీరజతో కలిసి త్రీ టౌన్ ఏరియాలో పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి వెంటనే కృషి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తర్వాత ఖమ్మం మార్కెట్ ఏరియా, ప్రకాశ్‌నగర్ లో పలు సమస్యలు పరిశీలించి సూచనలు చేశారు.
దంసలాపురం ఎగ్జిట్ పాయింట్ పనులు పరిశీలించి, త్రీ టౌన్ ప్రాంతానికి కలిపే రోడ్డును డబుల్ రోడ్డు ఏర్పాటుని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సాధు రమేశ్‌రెడ్డి, కమర్తపు మురళి, తల్లాడ రమేశ్, ఆళ్ల అంజిరెడ్డి, కొప్పెర ఉపేందర్, గజ్జల వెంకన్న, వల్లపు ఉపేందర్, ఖాదర్ బాబా, మందడపు బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు.