వెలుగుమట్ల అర్బన్​ పార్క్​ ను సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలోని వెలుగుమట్ల అర్బన్​ పార్క్​ ను బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఖమ్మం నగరవాసులు సేదతీరేందుకు అక్కడ ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత నగరంలోని లకారం ట్యాంక్​ బండ్​ ను సందర్శించారు. అక్కడ వాకింగ్ చేస్తున్న వారితో ముచ్చటించారు.  

మంత్రిని కలిసిన తల్లాడ కాంగ్రెస్ నాయకులు 

తల్లాడ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బుధవారం గండుగలపల్లిలోని ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ తల్లాడ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహకార సంఘాల్లో రైతులు తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేసి కొత్తగా ఇప్పించేందుకు చొరవ చూపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైరా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దుండేటి వీరారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పగడాల లచ్చిరెడ్డి, ఎంపీటీసీ కొమ్మినేని ప్రభాకర్ రావు, మాజీ సర్పంచ్ పోట్రు శరత్ బాబు, మాజీ జడ్పీటీసీ  మూకర్ ప్రసాద్, సామినేని రామ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.