కల్లూరు, వెలుగు : కల్లూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పరామర్శించారు. లింగాల గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకులు మట్టూరి భద్రయ్య, కట్టా పుల్లయ్య, చంద్రుపట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వల్లభనేని భద్రయ్యలను మంత్రి కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రబోయినపల్లికి చెందిన సీనియర్ నాయకుడు సాయిని అప్పారావు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన ఫొటోకు నివాళులర్పించారు.
చండ్రుపట్ల హెల్త్ సెంటర్ ను చెన్నూరు పీహెచ్సీని నుంచి కల్లూరు పీహెచ్సీకి మార్పు చేయాలని, చండ్రుపట్ల హై స్కూల్ కు అదనపు తరగతి గదులు నిర్మించాలని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఆయా శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ జిల్లా నాయకులు పసుమర్తి చందర్రావు, లక్కినేని కృష్ణ ఏనుగు సత్యంబాబు, దేవరపల్లి వెంకటేశ్వరరావు, మద్దినేని గోపాలరావు, దేవరపల్లిశ్రీనివాసరావు, పోట్రు సత్యం , దిరిశాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.