- మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు
- ఇరిగేషన్ ఆఫీసర్లపై తుమ్మల ఆగ్రహం
- మంత్రి ఆదేశంతో స్లూయిజ్ లాక్‌ల ఎత్తివేత
- భద్రాచలంలో ఎడతెరపిలేని వర్షం
హైదరాబాద్:ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాలయం అన్నదాన సత్రం వద్ద వరద నీరు నిలవడంపై మండిపడ్డారు. మంత్రి ఆదేశాలతో గోదావరి నది కరకట్ట స్లూయిజ్ లాక్‌లను ఎత్తి పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు.గోదావరి నీటిమట్టం 33 అడుగులకు చేరడంతో లాక్‌లను అధికారులు ఎత్తివేశారు. కాగా భద్రాచలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.
మాలయం పరిసర ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది.పట్టణంలోని వర్షపు నీరు డ్రైయినేజ్ నీరు మోటార్లతో ఎత్తిపోయక పోవడంతో వరద నీరు నిలిచిపోయింది. దేవస్థానం ఆలయం అన్నదాన సత్రంలోకి చేరిన వరద నీరు చేరింది. దీంతో అన్నదానం సత్రాన్ని మూసివేశారు. భక్తులకు పాకెట్‌ల ద్వారా అన్నదానానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. గోదావరి నది కరకట్ట స్లూయిజ్‌ల నుండి వర్షపు నీటిని పంప్ చెయ్యకపోవడంతో నీట మునిగిన రామాలయ ప్రాంతం నీట మునిగింది.
షయం తెలిసిన మంత్రి తుమ్మల..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గోదావరి నది కరకట్ట స్లూయిజ్ లాక్‌లను ఎత్తి పట్టణంలోని వర్షపు నీటిని గోదావరిలోకి విడుదల చేయడంతో రామాలయ ప్రాంతం వాసులకు ఉపశమనం కలిగింది.