పంట ధరలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లెటర్

పంట ధరలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లెటర్
  • మిర్చి, పసుపు ధరలకు మద్దతు కల్పించాలని వినతి 

హైదరాబాద్​, వెలుగు: అంతర్జాతీయ​మార్కెట్​లో ఒడిదుడుకులతో మిర్చి ధరలు తగ్గాయని దీంతో రాష్ట్రంలోని మిర్చి రైతులు ఆందోళనలో ఉన్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ​కు మంత్రి తుమ్మల లేఖ రాశారు. రైతుల శ్రేయస్సు కోసం నాఫెడ్ ద్వారా మిర్చి పంటను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలన్నారు. అదే విధంగా నిజామాబాద్ మార్కెట్ లో పసుపుకు సంబంధించిన ప్రత్యక్ష కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, బుధవారం సెక్రటేరియెట్​లో టెక్స్ పోర్ట్ కంపెనీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధులు మంత్రి తుమ్మలను కలిశారు.