
కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయపరమైన వాటా కోసం కొట్లాడాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలసౌధలో ఇరిగేషన్ అధికారులు, సీనియర్ అడ్వొకేట్, ఇరిగేషన్ ఆఫీసర్స్, లీగల్ కన్సల్టెంట్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక భేటి నిర్వహించారు.
కృష్ణా ట్రిబ్యునల్ లో ప్రభుత్వం తరపున జస్టిస్ వైద్యనాథ్ వాదనలు వినిపించనున్న సంగతి తెలిసిందే. కృష్ణా ట్రిబ్యునల్ ముందు సమర్పించిన వాదనలపై మంత్రికి వివరించారు. అలాగే ఏప్రిల్ 15,16,17న జరిగే వాదనలపై సీనియర్ న్యాయవాది వైద్యనాథ్ ఉత్తమ్ కు వివరించారు. కృష్ణా జలాల్లో న్యాయపరమైన వాటా కోసం వాదనలు కొనసాగిస్తామన్నారు.
ALSO READ | పాలనపై పట్టులేని రేవంత్ రబ్బర్ స్టాంప్ సీఎం: బండి సంజయ్
ఈ సందర్బంగా నిజమైన వాటా దక్కేలా ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలని సూచించారు ఉత్తమ్. చట్టపరంగా తెలంగాణ నీటి హక్కులను సాధించాలన్నారు. లీగల్ టీంకు ప్రభుత్వం తరపును ఫుల్ సపోర్ట్ ఉంటుందన్నారు. దశాబ్ధాలుగా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. అవసరమైతే ట్రిబ్యునల్ ముందు తానే హాజరవుతానన్నారు ఉత్తమ్.