వచ్చే నెల 15లోగా రుణమాఫీ చేస్తం : ఉత్తమ్

  • సాగుకు అవసరమైన సౌలతులన్ని రైతుకు కల్పిస్తం
  • టీజీఎస్ డీసీఎల్  చైర్మన్​గా  అన్వేశ్ రెడ్డి బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు : వచ్చే నెల 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేసేందుకే ఒకే దఫాలో రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇది లక్షలాది మంది రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.

సోమవారం తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ అన్వేశ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  సైఫాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ పాల్గొని, మాట్లాడారు.  రైతుల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారం చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించామన్నారు. ఇది రైతులందరికీ ఏడాదికి ఎకరాకు రూ.15,000 పెట్టుబడి మద్దతునిస్తుందని చెప్పారు.

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తం

రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు.  గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలో జరిగిన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ప్రజాధనం వృథా అయ్యిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి.. లక్ష ఎకరాలకు కూడా నీరందించలేదని మండిపడ్డారు. 

ALSO READ : బీజేపీ, బీఆర్​ఎస్​వి రహస్య ఒప్పందాలు : ఆది శ్రీనివాస్

అన్వేశ్ రెడ్డి నియామకంపై అభినందనలు తెలిపిన ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పటిష్టమైన సంస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. 

రైతుల నుంచి అన్ని ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ)కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని, వ్యవసాయ కార్యకలాపాలను యాంత్రీకరించడంతో పాటు, వ్యవసాయ దిగుబడిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.