సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పెద్దగట్టు జాతర : ఉత్తమ్​ కుమార్ రెడ్డి

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పెద్దగట్టు జాతర : ఉత్తమ్​ కుమార్ రెడ్డి

సూర్యాపేట వెలుగు: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దగట్టు జాతర ప్రతీక అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మన సంప్రదాయాల పరిరక్షణకు  ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని దూరాజ్​పల్లి పెద్దగట్టు జాతరకు సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో సమ్మక్క-–సారక్క జాతర తర్వాత దూరాజ్ పల్లి పెద్దగట్టు జాతర అంతటి ప్రాశస్త్యం కలిగింది.

 16వ శతాబ్దంలో మొదలైన ఈ జాతర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింస్తుంది” అని తెలిపారు.  రెండేండ్లకు ఒకసారి జరిగే పెద్దగట్టు జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. జాతరకు సీఎం రేవంత్​రెడ్డి రూ. 5 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఏపీ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి 30 లక్షల భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.