
గత పదేళ్లు దేవాదులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు మంత్రి పొంగులేటి. వైఎస్సార్ ఉన్నప్పుడే దేవాదుల ఫేజ్ 1 పూర్తయిందన్నారు. మూడో ఫేజ్ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు పొంగులేటి. దేవాదుల పంప్ హౌస్ ఫేజ్ 3 లో భాగంగా నిర్మించిన మోటార్లను ఆన్ చేశారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. . ఒక మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి.. గత ప్రభుత్వం కమీషన్ల కోసమే తాపత్రయపడింది కానీ..ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. సాగునీటి సమస్యకు గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు. మిషన్ భగీరథ పేరుతో 39 వేల కోట్లు ఖర్చు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సమాధానం చెప్పాల్సి ఉంటది కాబట్టే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదన్నారు. చర్చ లేనిరోజునే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని సెటైర్ వేశారు పొంగులేటి.
ALSO READ | ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో ఏపీ టాప్.. తెలంగాణ స్థానం ఎంతంటే..?
దేవాదుల ఆయకట్టుకు నీరందించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్టేషన్ ఘన్ పూర్, జనగామ,పాలకుర్తి,పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు నీరందుతుందన్నారు. గత పదేళ్లుగా దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మార్చి19 న దేవాదుల రావాలనుకున్నాం కానీ..బడ్జెట్ ఉండటంతో ఇవాళే వచ్చామన్నారు ఉత్తమ్.