మేళ్లచెరువు జాతరను  ఘనంగా నిర్వహించాలి మంత్రి ఉత్తమ్  

మేళ్లచెరువు జాతరను  ఘనంగా నిర్వహించాలి మంత్రి ఉత్తమ్  

మేళ్లచెరువు, వెలుగు: ఈ ఏడాది ఫిబ్రవరిలో రాబోవు మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాది తొలిరోజు బుధవారం ఆయన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు లోని స్వయంభు శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన జాతర సమీక్షా సమావేశంలో మాట్లాడారు.

సుదీర్ఘ కాలం పాటు తాను పలు పదవులు నిర్వహించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని అన్నారు.ఈ ప్రాంతంతో తనకు  ప్రత్యేక అనుబంధం ఉన్నదని గుర్తు చేసుకున్నారు.వందల కోట్లతో ఉమ్మడి మేళ్లచెరువు మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, హుజూర్​ నగర్ లో తాజాగా డిగ్రీ, జూనియర్ కాలేజీల కొత్త బిల్డింగ్ లు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఫండ్స్ శాంక్షన్ చేయించానని చెప్పారు. మేళ్లచెరువు మహాశివరాత్రి జాతరను గతం కంటే ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు.భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్కోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.

సమీక్షలో ఆఫీసర్లు ఎక్కడని సీరియస్

జాతర రివ్యూ మీటింగ్ ఉన్నదని సమాచారం ఇస్తే అన్ని శాఖల ఆఫీసర్లు ఎందుకు రాలేదని సీరియస్ అయ్యారు. మేళ్లచెరువు నుండి కోదాడ మార్గంలో కందిబండ వద్ద రెండు బ్రిడ్జిలు కూలిన విషయం తన దృష్టికి ఎందుకు తీసుకరాలేదని లోకల్ లీడర్లపై సీరియస్ అయ్యారు.లక్షల మంది భక్తులు ఈ దారివెంట ఎలా వస్తారని ప్రశ్నించారు. గుండ్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయడం లేదని తెల్సుకుని ఆ శాఖ జిల్లా ఆఫీసర్లపై ఫోన్ లో సీరియస్ అయ్యారు.

నిర్ణీత టైంలో పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు.జాతరలో ఎడ్లపందేలు ప్లానింగ్ ప్రకారం నిర్వహిస్తూ ఇక్కడ ఏం జరుగుతుందో తనకు చెప్పాలని గరం అయ్యారు.ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, సిఐ రజితారెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఈఓ కొండారెడ్డి, ఎస్సై పరమేష్, చైర్మన్ శంభిరెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి,సైదేశ్వర్ రావు పాల్గొన్నారు.