హుజూర్ నగర్ , మఠం పల్లి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తువులకు అండగా ఉంటుందని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేట్ కట్ చేసి క్రైస్తవులకు విషెస్ చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుతో మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ రాబోతోందని అందరికీఅండగా ఉంటామని మాటిచ్చారు. ముఖ్యంగా మతంమారిన దళితులకు ఎస్సీ సర్టిఫికెట్ వచ్చేలా పార్లమెంట్‌లో తానే పోరాడానని గుర్తుచేశారు. ఆదూరి కిషోర్ రెడ్డి, గాలి చిన్నపు రెడ్డి, తిరుమరెడ్డి జోజి రెడ్డి, గాదె మర్రెడ్డి, పాలేపు శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ యూసుఫ్ మంత్రి ఉత్తమ్‌ను కోరారు. సోమవారం మంత్రి నివాసంలో ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని రిక్వెస్ట్ చేశారు.
అంతకుముందు హుజూర్ నగర్ మండలం లింగగిరి పీఏసీఎస్ చైర్మన్ కట్టా గోపాల్ రావు 20 మంది అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నేతలు వెంకటరెడ్డి, ధర్మరాజు, శేఖర్, ప్రసాద్ , నాగరాజు, అంజయ్య పాల్గొన్నారు.