ఘనంగా మంత్రి ఉత్తమ్ పుట్టినరోజు వేడుకలు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పౌరసరపరాల, భారీ నీటి పారుదలశాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల్లోని పార్టీ ఆఫీసుల్లో నాయకులు కేక్ కట్​చేసి పంచిపెట్టారు. పలుచోట్ల రక్తానం శిబిరం ఏర్పాటు చేసి యువకులు రక్తదానం చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టులతో ఆయా నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరు అందించటానికి కోట్ల రూపాయలతో పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ‌‌ ‌‌  ‌‌ ‌‌   -

 వెలుగు నెట్​వర్క్