లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదు : మంత్రి ఉత్తమ్

లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోదాడను అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలోని మోతె మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..   జీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టస్తుందని..  ఆ పార్టీకి  మరో అవకాశం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తుందని చెప్పారు. పదేళ్ళుగా బీజేపీ ప్రచారానికే పరిమితం అయ్యిందని చేసిందేమీ లేదని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము 11 మంది కలిసి క్రికెట్ జట్టుగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్.  తన కంటే గొప్పగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి పార్లమెంట్ లో ప్రజల తరపున పోరాడుతాడన్నారు.  ప్రతి కార్యకర్త సైనికిడిలా పనిచేసి రఘువీర్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు తదితరులు హాజరయ్యారు. 

Also Read:ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్