పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు . ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్13 నుంచి 14 స్థానాల్లో గెలుస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.  దేశంలో ఎక్కువ మెజారిటీ నల్లగొండలో వస్తుందన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా  నల్లగొండ గళాన్ని పార్లమంట్ లో వినిపించానన్నారు.  ఆనాడు ఆర్ధికంగా ఇబందుల్లో ఉన్నా తనకు కార్యకర్తల త్యాగంతో ఎంపీగా గెలిచానని చెప్పారు.  

తెలంగాణలో  ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్న మంత్రి ఉత్తమ్ ..  వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ,  బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. అన్ని విధాలుగా మోడీ హయాంలో ప్రజాస్వామ్యం అణచి వేయబడుతుందని ఆరోపించారు.  కాళేశ్వరం అవినీతి పై మాట్లాడే మోడీ కేంద్ర సంస్థలు రుణాలు ఎలా ఏర్పాటు చేశారని మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమేనని విమర్శి్ంచారు.