తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తాం.. మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లాలో నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పాలనలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్న బియ్యం ఇస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని.. దీంతో 40 లక్షల మంది అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారన్నారు.  రేషన్ కార్డు రాని వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.   అర్హత వున్న ప్రతి  వ్యక్తి  వరకు రేషన్ కార్డులు అందిచేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

విపక్షాలు రేషన్ కార్డులగురించి  చేస్తున్న తప్పుడు ప్రచారాలను మానుకోవాలని సూచించారు.  పాలకీడు మండలాభివృద్దికి ఎన్నో కార్యక్రమాలు చేశామన్న మంత్రి ఉత్తమ్  .. జాన్ పహాడ్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఎత్తి పోతల పథకానికి భూమి పరిశీలన పూర్తి అయిందన్నారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే లిఫ్ట్ కు జవహర్ లాల్ నెహ్రూ నామకరణం చేస్తున్నామని తెలిపారు.

Also Read :- క్రీడాకారులు స్పూర్తితో ఆడాలి

జాన్ పహాడ్ సైదులు బాబా దర్గాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  జనవరి 23,24,25 తేదీల్లో జరిగే ఉర్సు ఉత్సవాల ఏర్పట్లను పరిశీలించారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...జాన్ పహాడ్ దర్గా అంటే  తనకు ప్రత్యేక అభిమానమని సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిందన్నారు.  ప్రతి ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు .. హిందువులు.. ముస్లింలతో పాటు లక్షలాదిగా భక్తులు హాజరవుతారని.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను కోరారు.  ఉమ్మడి రాష్ట్రంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఉర్సు ఉత్సవాలకు రూ. 60 లక్షలు కేటాయించగా... ఇప్పుడు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. దర్గా అభివృద్దికి కోటి 11 లక్షల రూపాయలను మంజూరు చేశానన్నారు.