ఖమ్మం జిల్లాకు ఈ రోజు చారిత్రాత్మక రోజు:మంత్రి ఉత్తమ్

ఖమ్మం జిల్లాకు ఈ రోజు చారిత్రాత్మక రోజు:మంత్రి ఉత్తమ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని  సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ -2   ట్రయిల్ రన్  నిర్వహించారు  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మలనాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఉత్తమ్.  ప్రతి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.  ఆగస్టు15న సీఎం రేవంత్ రెడ్డి  2 ,3 లిఫ్ట్ ఇరిగేషన్ లు ప్రారంభించి..అదే రోజు 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తారని వెల్లడించారు

సీతారామ ప్రాజెక్ట్ లో లిఫ్ట్ 2, లిఫ్ట్ 3 ట్రయిల్ రన్ చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.   రీ డిజైన్ పేరుతో   గత పాలకులు 8వేల కోట్లువృథా చేశారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక జిల్లాలో అనేక నియోజకవర్గాల  రైతులకు ఈ ప్రాజెక్ట్  ఉపయోగపడుతుందని చెప్పారు.  భద్రాచలం, ఎల్లందు నియోజకవర్గ రైతులకు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు పొంగులేటి