కేసీఆర్కు కళ్లు నెత్తికెక్కి..ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు: ఉత్తమ్

కేసీఆర్కు  కళ్లు నెత్తికెక్కి..ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు: ఉత్తమ్

మాజీ సీఎం కేసీఆర్ పై  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తొక్కుకుంటూ మేడిగడ్డకు వెళ్తామంటున్న కేసీఆర్ కు కళ్లు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  మేడిగడ్డ పిల్లర్లు కుంగినపుడు ఆయనే  సీఎంగా ఉన్నా.. కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.  కేసీఆర్ రైతులకు తీరని అన్యాయం చేశారని..ఇది ముమ్మాటికి కేసీఆర్ తెచ్చిన కరువేనన్నారు.

కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్.   రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా కరెంట్ సరఫరా చేశామన్నారు.  పాలేరు రిజర్వాయర్ కోసమే సాగర్ నుంచి నీళ్లు వదిలామన్నారు ఉత్తమ్. ప్రభుత్వ  ప్రణాళిక ప్రకారమే నీళ్లు  ఇస్తున్నామని చెప్పారు.  ఉన్న నీటి  ఎలా వాడాలో ఎప్పటికప్పుడు  సమీక్షిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ లా దొంగ పాస్ పోర్టులు అమ్మి రాజకీయాల్లోకి రాలేదన్నారు.  ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా కావాలని కేసీఆర్ అడిగారు..  మళ్లీ కమీషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం మొదలు పెట్టారని ఆరోపించారు.

కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలు

 

  • కేసీఆర్ కు కళ్లునెత్తికెక్కినయ్.. పొగరుబోతు 
  • మేడిగడ్డ లాంటి ఘటన జరిగితే వేరే దేశాల్లో ఉరితీస్తారు 
  • కేసీఆర్ పిచ్చిలేసినట్లు మాట్లాడుతున్నడు -
  • కాళేశ్వరంలో ఏ బ్యారేజీకి కరెక్ట్ డిజైన్లు లేవు.
  • పేక మేడల్లా కూలిపోయే చెక్ డ్యాంలు నిర్మించారు
  •  మళ్లీ కేసీఆర్ మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు
  •  తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కేసీఆర్ అప్పులు తెచ్చారు
  •  కేసీఆర్ తీరుతోనే  రాష్ట్రంలో కరువు పరిస్థితులు.
  •  కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు బొందపెట్టారు
  •  ప్రజలు బుద్ధి చెప్పినా ..కేసీఆర్ తీరు మారడం లేదు
  • కృష్ణా జలాలను కేసీఆర్ ఏపికి అప్పగించారు
  • కృష్ణానది జలాలపై కేసీఆర్ జగన్ కుమ్మక్కయ్యిండు
  • కాళేశ్వరం అప్పులు ఏటా 17  వేల  కోట్లు ఖర్చు పెట్టాలి 
  • బ్యారేజీకి, డ్యామ్ కి తేడా తెల్వని తెలివితక్కువోని డిజైన్ అది 
  • డ్యామ్ సేఫ్టీ వాళ్లు చెప్పినా కేసీఆర్ తిక్కలోడిలా మాట్లాడుతుండు
  • లక్షకోట్ల అప్పుతో ముంచి.. ఇంకా చిన్న తప్పు అంటవా?
  • నీళ్ల తిప్పలున్నాయని కేసీఆర్ పాలనలోనే చెప్పిండు
  • కేసీఆర్ వి జోకర్, బ్రోకర్ మాటలే 
  • కేసీఆర్ బతుకంతా అబద్ధాలు, మోసమే
  • 24 గంటల కరెంటిస్తూ.. ఉన్న నీళ్లతో పంటలు కాపాడుతున్నం