కాళేశ్వరం నీళ్లు లేకుండానే తెలంగాణలో అధికంగా వరి సాగు అయ్యిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు అయ్యిందని తెలిపారు. రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. హాస్టల్ మెస్, డైట్ చార్జీలు పెంచామని చెప్పారు ఉత్తమ్. ఏడాదిలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఏడాదిలో కోదాడకు 400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామని తెలిపారు ఉత్తమ్.
ALSO READ | మాలల ఆత్మ గౌరవం, ఐక్యతను చాటి చెప్పాం: ఎమ్మెల్యే వివేక్
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పాల్గొన్నారు.