హైటెక్స్ లో మంత్రి ఉత్తమ్ తండ్రి దశదిన కర్మ

హైటెక్స్ లో మంత్రి ఉత్తమ్ తండ్రి దశదిన కర్మ
  •   నివాళి అర్పించిన సీఎం, మంత్రులు

మాదాపూర్, వెలుగు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి దశదిన కర్మ గురువారం మాదాపూర్ లోని హైటెక్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్  రెడ్డి హాజరై పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై అంజలి ఘటించారు. ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, వేం నరేందర్ రెడ్డి, ఐఎన్ పీఆర్ కమిషనర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్, వంశీచందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి భార్య నలమాద ఉషాదేవి, కుమారులు, కోడళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి, గౌతమ్ కుమార్ సుమ, కుమార్తె హితశ్రీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.