గోదావరి జలాల్లో పాపం అంతా బీఆర్ఎస్‎దే: మంత్రి ఉత్తమ్

గోదావరి జలాల్లో పాపం అంతా బీఆర్ఎస్‎దే: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పొరపాటు రైతులకు శాపమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఏపీకి ధారదత్తంగా నీటిని ప్రభుత్వం వదిలిపెట్టిందని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీల నీటిని గత ప్రభుత్వం రాసిచ్చింది.. కానీ మేం అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చామన్నారు. గోదావరి జలాల్లో పాపం అంతా బీఆర్ఎస్‎దేనని విమర్శించారు. హరీష్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే కేసీఆర్, జగన్ కలిసి విందు చేసుకున్నారని మండిపడ్డారు.