
తుమ్మడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పై పాత నమూనాతో ముందుకెళ్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే విషయంపై ఏప్రిల్ లో మహారాష్ట్రకు వెళ్లి...అక్కడ మహారాష్ట్ర సీఎం, ఇరిగేషన్ అధికారులతో సమావేశమై చర్చిస్తామన్నారు ఉత్తమ్.
ALSO READ | పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన ఉత్తమ్ మహారాష్ట్రకు వెళ్లాక అన్ని సమస్యలు పరిష్కరించుకుని ఇదే వేసవిలో ప్రాణహిత చేవెళ్ల పనులు మొదలు పెడతామన్నారు. రెండేళ్లలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు ఉత్తమ్. దీని వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు.