పదేళ్లలో కేసీఆర్ అండ్ పార్టీ కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా 81వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టినా నామ మాత్రపు ఆయకట్టు మాత్రమే వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం పర్యాటక ప్రాంతంగా మార్చారు. కేసీఆర్ అవసరాలకోసమే ఈ ప్రాజెక్టును నిర్మించారన్నారు. వాళ్లే అప్పుడు, ఇప్పుడు పోతున్నారు.. వస్తున్నారని విమర్శించారు.
గతేడాది పెద్ద శబ్ధం వచ్చి కాళేశ్వరం కూలిపోయిందన్నా దొంగనాటకాలాడారని అన్నారు. ప్రాజెక్టు పిల్లర్లు 6ఫీట్లు భూమిలోకి కూలిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ పరిశీలిం చిందన్నారు. NSDA ఉత్తది కాదు.. మొత్తం ఇండియాలోనే డ్యామ్స్ సేఫ్టీ కోసం పనిచేస్తుంది.. పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పాటు చేసింది.. అలాంటి సంస్థ విజిట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని నిర్ధారించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read:-కేసీఆర్ అసెంబ్లీకి ఇన్నిరోజులు ఎందుకు రాలేదు.. అంత గర్వమా..
మేం అధికారంలోకి రాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది..పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ కూడా నమోదు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని వార్తలు వస్తే కేసీఆర్ ఒక్కమాట కూడా ఎం దు కు మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.