హుజూర్ నగర్/మేళ్లచెర్వు/ కోదాడ , వెలుగు: బీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని, ఆ రెండు పార్టీలు గెలవకుండా ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని భారీ నీటిపారుదుల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉమ్మడి జిల్లా సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.
సాయంత్రం హుజూర్ నగర్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీరా రెడ్డి, సీనియర్లీడర్ కుందూరు జానారెడ్డితో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని, ఎలక్షన్ల తర్వాత ఆ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా ఉండరన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఉత్తమ్స్వల్ప అస్వస్థతకు గురికాగా వెంటనే ఆయనను ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు.
కోలుకున్న తర్వాత ప్రచారంలో పాల్గొన్నారు.క్యాంపెయిన్లో జూలకంటి రంగారెడ్డి, నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థి కుక్కల వెంకన్న ఉత్తమ్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేళ్లచెర్వు, చిలుకూరులో మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి రఘువీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు కోదాడలో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి రఘువీర్ ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెనేపల్లి చందర్ రావు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.