తెలంగాణకు ఒరిగింది శూన్యం: మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి

తెలంగాణకు ఒరిగింది శూన్యం: మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు ఒరిగింది శూన్యమని మంత్రి ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి అన్నారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసిందని విమర్శించారు. 

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఐటీఐఆర్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ రంగానికి నిధుల కోత, ఆహార భద్రతకు తూట్లు పొడవడం దారుణమన్నారు.