రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టాం:మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సివిల్ సప్లయ్స్ శాఖ సాహసోపేతమైన నిర్ణయాలతో పీడీయస్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసిందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మెచ్చుకున్నారు. పటిష్ట చర్యలతో అక్రమాలకు అడ్డుకట్ట వేసిన సివిల్ సప్లయ్స్​ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.

 పీడీయస్ బియ్యం పక్కదారి పట్టకుండా కంట్రోల్ చేయడంలో తెలంగాణ సివిల్ సప్లయ్స్ శాఖ సక్సెస్ అయిందన్నారు. దేశవ్యాప్తంగా ఐసీఆర్ఈఆర్ చేసిన అధ్యయనంలో మన రాష్ట్రంలోనే పీడీఎస్ బియ్యం అతి తక్కువగా దారి తప్పుతున్నట్టు తేలిందని మంత్రి వెల్లడించారు.