నల్లగొండ: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు నూటికి నూరు శాతం పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్ లో రెండు వైపులు సమస్యలు న్నాయి. అయినా సరే రెండు వైపులా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడానికి రూ. 460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి ఆమోదంకోసం కేబినెట్ ముందుకు తీసుకెళ్లామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.. దేవరకొండ నియోజకవర్గంలో మంజూరైన అంబాభవాని, కంబాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
మరోవైపు నల్లగొండ జిల్లాలో అడవిదేవుల పల్లి మండలంలో ఉన్న దున్న పోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది పంద్రాగస్టు లోపు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత కొన్నేళ్లుగా దున్నపోతుల లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ఉంది.. ఈ ప్రాజెక్టు 5 లిఫ్టులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది.. అధికారులు చిత్త శుద్ధితో పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు నిండింది. నీటికి ఎలాంటి కొరత లేదు.. రెండు పంటలకు సరిపోను నీరుంది. సాగర్ పరిధిలో ఉన్న పెండింగ్ కాల్వల పనులను పూర్తి చేసేం దుకు నిధులు కేటాయించి.. వందకు వంద శాతం పనులు పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం రూ. 490 కోట్ల నిధులను కేటాయిస్తామన్నారు.