
హుజూర్ నగర్, వెలుగు : ఇకపై సోషల్ మీడియాలో సమరానికి సిద్ధం కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ లో హుజూర్ నగర్, కోదాడ సోషల్ మీడియా సభ్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ‘ఉత్తమ్ అన్న సోషల్ మీడియా వారియర్స్’గా నామకరణం చేశారు. సోషల్ మీడియా ఇన్చార్జిగా శ్రీధర్ రామస్వామిని నియమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిపారుదల రంగంలో రైతులకు మేలు జరిగేలా చేస్తున్న పథకాలను సోషల్మీడియా ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. ధాన్యం దిగుబడి, తెల్లరేషన్ కార్డుల మంజూరు తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇకపై సోషల్ వారియర్స్ కృషి చేస్తారన్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.