
నల్గొండ: పదేండ్లు అధికారంలో ఉన్న ఒక్క ఫ్యామిలీ వల్ల తెలంగాణ రాష్ట్రం సర్వనాశన మైందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సాగునీటి రంగంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి, బీఆర్ఎస్ నేతలు జేబులు నిం పుకొన్నారని ఫైర్ అయ్యారు. వారి కమీషన్ల కక్కుర్తి వల్లే రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిన కాళేశ్వరం నాణ్యత లోపించి మూడేళ్లలోనే కూలిపోయిందని అన్నారు.
నల్గొండలో ఉత్తమామాట్లాడుతూ 'గత ప్రభుత్వం నల్గొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను కేసీఆర్ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మళ్లీ పని ప్రారంభించిన కొన్ని రోజులకే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. ఇప్పటికైనా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తీరుతాం. రైతులను ఒప్పించిన తర్వాతే ప్రాజెక్టులకు భూ సేకరణ చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకాన్ని సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్ వరకు పొడిగిస్తాం. పూడిక వల్ల ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గింది. ఎస్ఆర్ఎస్సీ ఫేజ్ 2 పనులను పూర్తి చేస్తే.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి సమస్య తీరుతుంది. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి.. అప్పులు చేసి కాళేశ్వరం పేరిట రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారు.మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు పని కిరావని ఎన్ఎఎస్ఏ చెప్పింది.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకొని రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారు. కానీ, తెలంగాణకే 500 టీఎంసీలు కే టాయించాలని ఈ ప్రభుత్వం పోరాడుతోంది" అని ఉత్తమ్ అన్నారు. రూ.10వేల కోట్లు దోచుకుతిన్నరు : కోమటిరెడ్డి 'తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని కేసీఆర్ అనలేదా?' అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనే.. తెలంగాణ విలన్ కాంగ్రెస్ పార్టీ అని దారుణంగా మాట్లాడుతున్నారని ఫైర్అయ్యారు. 'తెలంగాణఇచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వెళ్లి సోని యాగాంధీ ఆశీస్సులు తీసుకోలేదా? ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం క్రమక్రమంగా నెర వేరుస్తోంది. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి రూ.10వేల కోట్లు దోచుకుతిన్నారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి వేల ఎకరాలు ఆక్రమించుకు న్నారు. మంత్రులు, అధికారులు ఫోన్లు ట్యాపింగ్ చేయించి.. అధికార దుర్వినియోగానికి పాల్ప డ్డారు. పదేళ్లు పాలించిన కేసీఆర్.. ఏనాడైనా ఉద్యోగులకు ఫస్టుకు జీతాలు ఇచ్చారా?' అని నిలదీశారు.