
అన్నారం బ్యారేజీ మరమ్మత్తు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజీ దగ్గర జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అన్నారం బ్యారేజికి నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువని.. అన్నారం బ్యారేజ్ కి బ్యాక్ వాటర్ లేక బ్యారేజ్ పై ఒత్తిడి పెరిగిందని ఉత్తమ్ కు చెప్పారు అధికారులు. అన్నారం బ్యారేజ్ నిర్మాణమే లోపబోయిష్టం. అప్పట్లో మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. అన్నారం బ్యారేజీకి ముంపు సమస్య ఎక్కువ. అయినా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు వినలేదు అని మంత్రి ఉత్తమ్ కు మొర పెట్టుకున్నారు అధికారులు. ఇసుక తొలగించాం.. 600 మీటర్లు సర్వే ,.. టెస్టులు చేశామని చెప్పారు అధికారులు.
పర్యటనలో భాగంగా అన్నారం బ్యారేజ్ పనులను పరిశీలన అనంతరం అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లి పనుల పురోగతిపై సమీక్ష చేస్తారు. అక్కడే మీడియాతో మాట్లాడతారు ఉత్తమ్.
పర్యటనలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ENC లు అనిల్ కుమార్, నాగేందర్ రావు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. బ్యారేజీల నిర్మాణాలను చేపట్టిన ఎల్అండ్ టీ, నవయుగ, ఆఫ్కాన్స్ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.