దేశ చరిత్రలోనే మొదటి సారి రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకు ఏడాదికి 12వేల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  పేదలకు కొత్త రేషన్ కార్డులిచ్చి..  ప్రతి వ్యక్తికి ఆరు కేజీల సన్న బియ్యం ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.  సంక్రాంతి తర్వాత ప్రతి ఎకరానికి 12వేలు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కార్యకర్తలను కోరారు మంత్రి ఉత్తమ్.

సంక్షేమ పథకాలు, సామజిక న్యాయం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. దేశ చరిత్ర లో ఎక్కడ లేని విధంగా ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు. తెలంగాణలో హుజుర్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని తెలిపారు. 

ALSO READ | విద్యార్థి రాజకీయాలు లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు:సీఎం రేవంత్రెడ్డి