
- సొరంగంలో చిక్కుకున్న వాళ్లను కాపాడుతమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి దిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఇలాం టి టైమ్‌లో రాజకీయాలేందని ప్రశ్నించారు. ‘‘దుర దృష్టకరమైన సంఘటన జరిగిన సమయంలో దుర్మార్గంగా మాట్లాడుతున్నరు. ఎస్ఎల్బీసీ టన్నె ల్లో వాటర్ సీపేజ్ సమస్య ఉందని 5 ఏండ్ల కింద గుర్తించిన గత ప్రభుత్వం రూ.29 కో ట్లు కేటా యించి పనులు చేయకుండా పక్కకు పెట్టింది నిజం కాదా? పదేండ్లు అధికారంలో ఉన్నా ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదు? ఏ నాడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రభత్వానికి అండగా ఉండాల్సిన ఈ సమయంలో బురద చల్లుతున్నారు” అని అన్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు రప్పించడమే తమ ప్రభుత్వ లక్షమని తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని.. హుటాహుటిన 11 గంటలకల్లా అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ‘‘గతంలోనూ బీఆర్ఎస్ హయాంలో లీకేజీలు జరిగాయి.
నాడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ స్టేషన్ ప్ర మాదంలో 8 మంది చనిపోతే వాళ్లు అక్కడికి వెళ్లిన పాపాన పోలేదు. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని వెళ్లకుండా అరెస్టు చేశారు. ఇప్పు డు ఘటన జరిగిన రెండు మూడు గంటల్లోనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాం” అని తెలిపారు. ప్రమాదంపై సీఎం రేవంత్ శనివారం సాయంత్రం సమీక్షించారు. స్పాట్‌కు వెళ్లి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పూర్తి వివరాలను సీఎంకు తెలియజేశారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అవాంతరాలు అధిగమిస్తం
సీఎస్, ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకుని ఎస్ఎల్బీసీ వద్ద సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పా రు. సీఎంతో సమీక్ష అనంతరం ఆయన ఈ ఘట నపై వివరాలు వెల్లడించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, అత్యాధునిక మెషినరీ సహాయంతో సహాయ చర్యలు కొనసా గుతున్నాయన్నారు. సొరంగంలో డీవాటరింగ్, డీ సిల్టింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో ఇద్దరు జేపీ అసోసియేట్స్ కంపెనీ ఇంజనీర్లు, నలుగురు జార్కండ్ కు చెందిన కూలీలు, మరో ఇద్దరు అమెరికన్ కంపెనీ రాబింగ్ కంపెనీ ఉద్యోగులు అని చెప్పారు.
ప్రపంచంలోనే రాబింగ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అని, వివిధ దేశాల్లో 3వేల కిలోమీటర్లకు పైగా టన్నెల్స్ తయారు చేసిన కంపెనీ అని వివరించారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడుతామని.. అవాంతరాలను అధిగమించి సొరంగాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ సొరంగం పూర్తయితే 3 లక్షల నుంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఇప్పటికే 33.5కి.మీ పనులు పూర్తయ్యాయ్యాయని, మరో 9.5 కి.మీ పనులు పూర్తి చేయాల్సి ఉందని వివరించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.