
- నేనొకటి మాట్లాడితే మరొకటి ప్రచారం
- ప్రస్తుత రాజకీయ జీవితంపై సంతృప్తిగా ఉన్న
- ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తం
- జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్న
- మీడియాతో మంత్రి ఉత్తమ్ చిట్ చాట్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కావాలనే కోరిక తనకు లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి తన రాజకీయ జీవితంపై సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 'ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాకు పదవులపై ఎలాంటి కోరికలు లేవు. నేను ఒకటి మాట్లాడితే మరొకటి ప్రచారం అవుతుందన్నారు.
ఎస్ఎల్ బీసీ రోబోటిక్ కోసం ఇప్పటి వరకు రూ. 4 కోట్లు విడుదల చేశామన్న ఆయన, ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ పట్ల చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. చైర్ కు గౌరవం ఇవ్వకుండా... స్థాయిని తగ్గించి మాట్లాడి స్పీకర్ ను అవమానపరిచారని విమర్శించారు. స్పీకర్ ను అవమానపరిచేట్లు మాట్లాడటం తాను ఇప్పటి వరకు చూడలేదన్న మంత్రి ఉత్తమ్, ఆయన వ్యాఖ్యలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా ఆయన మాదిరిగా వ్యవహరించరన్నారు.