గుడ్ న్యూస్: గ్రామ సభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులు

గుడ్ న్యూస్: గ్రామ సభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులు

రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. గ్రామసభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్నారు. రేషన్ కార్డు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం అందజేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

చారిత్రక మార్పు కోసం కోసం కాంగ్రెస్ ముందడుగు వేసిందన్నారు ఉత్తమ్.  గతంలో పెట్టుకున్న అప్లికేషన్ లు పరిశీలనలో ఉన్నాయన్నారు ఉత్తమ్.  ఆహారభద్రత చట్టం  తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు.  ప్రస్తుతం 90 లక్షల రేషన్‌ కార్డులున్నాయన్నారు. పదేళ్ల BRS పాలనలో 40 వేల రేషన్‌కార్డులే ఇచ్చారని ఫైర్ అయ్యారు. రేషన్ కార్డులపై బీఆర్ఎష్  దుష్ర్పచారం చేస్తుందని మండిపడ్డారు.   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇంటి కోసం 5 లక్షలు అందజేస్తామన్నారు.  ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.రైతు భరోసా ఎకరాకు 12 వేలు అందజేస్తామన్నారు. వ్యవసాయం చేసుకునే భూమికి మాత్రమే ఇస్తామన్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ మహిళా కూలీలకు సంవత్సరానికి 12 వేలు ఇస్తామని చెప్పారు ఉత్తమ్.  ఏ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదని.. కాంగ్రెస్ మాత్రమే ఇస్తుందన్నారు.