శ్రవణ్​కుమార్​ మృతి తీరని లోటు : ఉత్తమ్​కుమార్​రెడ్డి

శ్రవణ్​కుమార్​ మృతి తీరని లోటు : ఉత్తమ్​కుమార్​రెడ్డి
  • మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: మున్సిపల్ కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ రో డ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమ ని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖల మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్​నగర్ లో శ్రవణ్ కుమార్ మృతదేహానికి నివాళి అర్పించారు.  

ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం మృతుని భార్యాపిల్లలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లల విద్య పూర్తయ్యేవరకు తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శ్రవణ్ అంత్యక్రియల్లో పాల్గొని, పాడె మోశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ పాల్గొన్నారు.