
తుమ్మిడి హట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను మార్చడమే అతి పెద్ద తప్పని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ రిపోర్ట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు మంత్రి. కమీషన్ల కక్కుర్తి కోసమే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడుతోందన్నారు. కాళేశ్వరం డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ తేల్చిందన్నారు ఉత్తమ్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను కూడా బీఆర్ఎస్ వ్యతిరేకించడం మూర్ఖత్వమన్నారు ఉత్తమ్.
ఉత్తమ్ కామెంట్స్
- ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ చూసి కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సింది పోయి విమర్శలా.?
- తప్పు చేసినందుకు కేసీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలి
- వాళ్లు అధికారంలో ఉండగానే మేడిగడ్డ కూలింది
- వాళ్లు చేసిన అప్పుకు ఏడాదికి రూ. 16 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం
- ఎక్కువ వడ్డీకి షార్ట్ టైం లోన్లు ప్రాజెక్ట్ కోసం తెచ్చారు
- ఎన్డీఎస్ రిపోర్ట్ ను వ్యతిరేకించడం బీఆర్ఎస్ మూర్ఖత్వం
- తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కడతామని ఆనాడు కేసీఆర్ చెప్పారు
- ఇప్పటికీ తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తీయలేదు
- సుందీళ్ల, అన్నారం బ్యారేజీలు కట్టాల్సిన చోట కట్టలేదు
- డీపీఆర్ లో ఒకటి చెప్పి.. ప్రాజెక్ట్ మరో చోట కట్టారు
- తుమ్మిడి హట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను మార్చడమే పెద్ద తప్పు
- 80వేల కోట్లతో ప్రాజెక్ట్ అంచనా వేసి లక్ష కోట్లు ఖర్చు చేశారు
- తుమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదని బీఆర్ఎస్ అబ్దాలు చెబుతోంది
- కాళేశ్వరంతో రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం
- ఎన్డీఎస్ఏ పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా ఏర్పడింది
- ఎన్డీఎస్ ఏర్పాటుకు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది
- దేశంలో 5700 డ్యాంల భద్రత, సేఫ్టీని ఎన్డీఎస్ ఏ పర్యవేక్షిస్తోంది
- కాళేశ్వరం డీపీఆర్ చాలా హడావిడిగా చేశారు
- ప్రాజెక్టు మొదలు పెట్టాక డీపీఆర్ కు వెళ్లారు
- ప్రారంభానికి ముందే లోపాలు బయటపడ్డాయి కానీ బీఆర్ఎస్ ఒప్పుకోలేదు
- మేడిగడ్డ లొకేషనే పెద్ద మిస్టేక్..
- డ్యామ్ సేఫ్టీ రూల్స్ ఒక్కటి కూడా పాటించలేదు
- లోపాలతోనే మేడిగడ్డ కూలిపోయింది
- అక్టోబర్ 21,2023న మేడిగడ్డ కూలిపోయింది
- దేశంలో ఇంత పెద్ద నిర్లక్షమైన ప్రాజెక్ట్ ఇదే
- సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా ప్రాజెక్ట్ కట్టారు
- ఇంత పెద్ద మానవ తప్పిదాన్ని ఇతర దేశాల్లో ఒప్పుకోరు
- కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది.