మహేశ్వర్ రెడ్డివి దుర్మార్గమైన ఆరోపణలు : మంత్రి ఉత్తమ్

మహేశ్వర్ రెడ్డివి దుర్మార్గమైన ఆరోపణలు :  మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలనే కోరికతోనే అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన మాటలన్నీ అవాస్తవం, నిరాధారం అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వంద రోజుల్లో తెలంగాణలో అద్భుతమైన పాలన సాగించామన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి సర్కారును సజావుగా నడిపిస్తున్నామని తెలిపారు. తాము ‘యూ’ట్యాక్స్​వసూలు చేస్తున్నామని మహేశ్వర్ రెడ్డి అనడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం తాను కుటుంబంతో దైవ దర్శనానికి వేరే రాష్ట్రానికి వచ్చానని, బుధవారం హైదరాబాద్‌‌‌‌కు తిరిగి రాగానే ఆయన ఆరోపణలకు తగిన జవాబు చెబుతానని ఉత్తమ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.