నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జలసౌధలో జరిగిన ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఉత్తమ్. ఈ క్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఉత్తమ్. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు.ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని, ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనని ఆదేశించారు మంత్రి ఉత్తమ్. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసారు ఉత్తమ్... కేసీఆర్ పాలనలోనే కాళేశ్వరం కట్టారని, వారి పాలనలోనే కూలిందని అన్నారు. కాళేశ్వరం కూలడానికి పూర్తి బాధ్యత కేసీఆర్ కుటుంబానిదే అన్నారు.