తెలంగాణ రాష్ట్రలో సంక్రాంతి తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈసారి వరి ధాన్యం 150లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని ఆయన అన్నారు. ప్రోత్సహకంగా సన్న వరి ధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు ఆయన. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రోడ్డు &భవనల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంత మెజార్టీ ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.
Also Read :- రాష్ట్రవ్యాప్తంగా 27వేల ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్!
ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10లక్షల రూపాయలు ఉచిత వైద్యం, రూ.18వేల కోట్లతో ఋణ మాఫీ, అన్ని సౌకర్యాలతో అధునాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. భారతదేశంలోనే ఎంతో ప్రతిష్ఠముగా ఇంట్రెగ్రాటెడ్ స్కూల్ మంజూరు చేసాము. సర్వే నెంబర్ 57లో ఇంటిగ్రెటెడ్ స్కూల్ ను రూ.200కోట్లతో నిర్మించుకుంటున్నామని మంత్రి వివరించారు. ఈ స్కూల్ లో 4 నుంచి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి వచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నవారు కాంగ్రెస్ సభ్యులు కారు.. వీరంతా మా కుటుంబ సభ్యులని అన్నారు.