
- అదీ కొందరికే.. బీజేపీది తప్పుడు ప్రచారం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సన్నబియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వానిదే
- ఈ స్కీమ్‌తో రాష్ట్ర సర్కార్పైఅదనంగా 20% భారం
- 3.10 కోట్ల మందికి 30 లక్షల టన్నుల సన్నబియ్యం సరఫరా
- అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు.. పరిశీలనలో 30 లక్షల అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, దీనితో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం దొడ్డుబియ్యాన్ని, అది కూడా కొద్దిమందికే పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ‘‘సన్న బియ్యం పంపిణీలో కేంద్రం పాత్ర ఉందంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నది.
ఈ అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టాలి” అని ఆయన సూచించారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేస్తున్నామని, ఇందుకు గతంతో పోలిస్తే అదనంగా 20శాతం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ‘‘సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలి.. లబ్ధిదారులతో కలిసి భోజనం చేయాలి.. అప్పుడే పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ పెడ్తున్న ప్రత్యేక శ్రద్ధను ప్రజలు గుర్తిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జలసౌధ నుంచి ప్రజాప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికీ తమ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఏటా 3 కోట్ల 10 లక్షల మందికి ఉచితంగా 30 లక్షల టన్నుల సన్నబియ్యం సరఫరా చేయబోతున్నామని ఆయన తెలిపారు.
గతంలో వ్యాపారులు కోట్లకు పడగెత్తిన్రు
‘‘గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.10,665 కోట్లు ఖర్చు చేసి రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే వాటిని జనం తినలేదు. దీంతో ఆ బియ్యం పక్కదోవపట్టి అనేక అక్రమాలు జరిగాయి. పేదల పేరుతో వ్యాపారులు కోట్లకు పడగెత్తారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించాం. గతంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20శాతం ఖర్చు మీదపడుతున్నా.. మొత్తంగా ఏడాదికి రూ. 8,033 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది” అని మంత్రి వివరించారు.
లబ్ధిదారులు 3కోట్ల 10లక్షలకు పెరగొచ్చు
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. తెలంగాన రాష్ట్రం ఆవిర్భావ సమయంలో 89.73 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చింది కేవలం 49,479 తెల్ల కార్డులేనని చెప్పారు. రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్పించడంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల నుంచి 30 లక్షల అప్లికేషన్లు స్వీకరించామని.. ప్రస్తుతం అప్లికేషన్లన్నీ పరిశీలనలో ఉన్నాయని, వెరిఫికేషన్పూర్తికాగానే కార్డులు జారీ చేస్తామని చెప్పారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 2 కోట్ల 81 లక్షల నుంచి 3 కోట్ల 10 లక్షలకు పెరగవచ్చని ఆయన అన్నారు. పెరుగుతున్న లబ్ధిదారులకు సరిపడా సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కాళేశ్వరం కూలినా ధాన్యం దిగుబడి పెరిగింది
బీఆర్ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం కూలిపోయినా, మేడిగడ్డ పనిచేయకపోయినా.. రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి 1.23 కోట్ల ఎకరాల్లో 2.81 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి తెలిపారు. ఇందుకు రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమన్నారు. పేదలకు సన్న బియ్యం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమ లులోకి తెచ్చేందుకు గాను రైతులకు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అంది స్తున్నామని వివరించారు. గత వానాకాలం సీజన్లో మద్దతు ధర ప్రకారం రూ. 12,511 కోట్లు చెల్లించడంతో పాటు, 4.41 లక్షల మంది రైతుల నుంచి 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ. 1,199 కోట్లు బోనస్ రూపంలో చెల్లిం చామన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల కోసం 8,209 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలులో జిల్లాల కలెక్టర్లకు పూర్తి అధి కారం ఇచ్చామని, అదనంగా సెంటర్లు అవ సరం ఉన్న చోట ప్రజాప్రతినిధులు కలెక్ట ర్లతో సంప్రదించి ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. జాతీయ విధానం ప్రకారం తేమ17 శాతానికి మించకుండా సెంటర్లకు తీసుకురావాలన్నారు. 25 శాతానికి మించి నూకలు ఉన్న బియ్యం సరఫరా చేస్తే రైస్ మిల్లర్లపై చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు.