- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- హుజూర్‌నగర్, కోదాడ అభివృద్ధిపై ఆఫీసర్లతో రివ్యూ
హుజూర్‌నగర్, వెలుగు : హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లోని పలు అభివృద్ధి పనులపై కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి సెక్రటేరియట్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్‌తో సోమవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు రూ.42 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు.
హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో ఈద్గా, శ్మశాన వాటికలు, సీసీ రోడ్ల అభివృద్ధికి రూ.3 కోట్లు, గోవిందాపురం – హుజూర్‌నగర్ బ్రిడ్జికి రూ.2 కోట్లు, దోభి ఘాట్ కోసం రూ. 2 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీని క్లీన్‌గా ఉంచడంలో భాగంగా ఆటోమేటిక్ స్వీపింగ్ మిషన్‌ను మంజూరు చేశామన్నారు. కోదాడ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి రూ.8 కోట్లు, టౌన్ హాల్ నిర్మాణానికి రూ.6 కోట్లు, ఖమ్మం ఎక్స్ రోడ్ జంక్షన్ అభివృద్ధికి రూ.50 లక్షలు, హైదరాబాద్, విజయవాడ రోడ్లలో స్వాగత తోరణాల నిర్మాణానికి
రూ. 1.10 కోట్లు చెరువుకట్ట బజార్ నుంచి అనంతగిరి రోడ్డు వరకు అవుట్ ఫ్లో డ్రెయిన్ నిర్మాణానికి రూ. 4.40 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కోదాడ మున్సిపాలిటీలో శానిటరీ సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డి.దివ్య, హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, కమిషనర్లు పాల్గొన్నారు.