కాకా వెంకటస్వామి రాజకీయాల్లో లెజెండ్ అని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్. కాకా జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వెంకటస్వామి చేయని పదవి లేదు.. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా సేవలందించారని అన్నారు. దివంగత కాకా మా అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. ఎంతో మంది పేదలకు మంచి విద్య అందిస్తున్నారని తెలిపారు.
సరోజా వివేక్ పై ఉత్తమ్ ప్రశంసలు
విద్యాసంస్తలను కరస్పాండెంట్ సరోజా వివేక్ సరోజా సక్సెస్ పుల్ గా రన్ చేస్తున్నారని ఉత్తమ్ అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం మంచి పరిణామం అని చెప్పారు. లాభాపేక్ష లేకుండా విద్య అందించడం చాలా అరుదన్నారు. విద్యా సంస్థలకు ఎలాంటి సాయం కావాలన్న చేస్తామని చెప్పారు. ఎడ్యుకేషన్ బలపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క టీచర్ ను రిక్రూట్ చేయలేదు.. తాము వచ్చాక 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు ఉత్తమ్.