నిపుణల  నిర్ణయం మేరకే తుమ్మిడిహెట్టి పనులు : ఉత్తమ్‌‌‌‌ కుమార్ రెడ్డి

నిపుణల  నిర్ణయం మేరకే తుమ్మిడిహెట్టి పనులు : ఉత్తమ్‌‌‌‌ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇరిగేషన్‌‌‌‌ శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్ రెడ్డి తెలిపారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో టెక్నికల్ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ సూచనల మేరకు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంపై బుధవారం శాసనమండలిలో లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్‌‌‌‌  సమాధానాలు చెప్పారు. సుందిళ్లలో సీపేజ్‌‌‌‌ ఉన్నందున స్టోరేజ్ చేయలేకపోతున్నామని తెలిపారు. నేషనల్‌‌‌‌ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ టీమ్ ఈ వారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నదని.. వారు క్లియరెన్స్ ఇస్తే మేడిగడ్డను వదిలి అన్నారం, సుందిళ్లలో నీళ్లు నిల్వ చేసే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

గందమల్ల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌పై నిర్ణయం తీసుకుంటాం

యాదాద్రి జిల్లాలోని గందమల్ల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క రూపాయి పని కూడా జరగలేదని మంత్రి చెప్పారు. భూ సేకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. గ్రామస్తులు సహకరిస్తే పనులు వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. టీఎంసీ రిజర్వాయర్‌‌‌‌ కోసం వెంటనే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కానీ, 4.28 టీఎంసీ కెపాసిటీతో నిర్మిస్తే గందమల్ల గ్రామం పూర్తిగా మునిగిపోతుందని చెప్పారు. దీనిని ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ‌‌‌‌ఈ పరిస్థితుల్లో 1.5 టీఎంసీ కెపాసిటీతో నిర్మించాలా? లేదంటే 4.28 కెపాసిటీతో నిర్మించాలా? అనేది తేల్చి.. రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఉత్తమ్​ స్పష్టం చేశారు.

త్వరలోనే  కొత్త రేషన్ కార్డులు

 రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కొత్త  రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ కార్డులు చెలామణి అవుతాయని తెలిపారు. కొత్తగా అర్హులైన వారికి త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. బుధవారం శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ తాతా మధు మేడిగడ్డ సహా ఇతర ప్రాజెక్టులపై ప్రశ్నించారు.

నీళ్లు వృథాగా పోతున్నాయని, ప్రాజెక్ట్ లలో నీళ్లు అడుగంటుకున్నాయని, నీటి నిల్వ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదని అడిగారు. ఈ ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానాలిచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మేడిగడ్డ వద్ద నీళ్లు వృథాగా పోతున్నాయని పేర్కొన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్ లో నీటిని నిల్వ చేయడం వల్ల సాగు , తాగు నీటి సమస్యలు రావని  వెల్లడించారు. గత సర్కారు నిర్లక్ష్యాన్ని వివరించారు.