
మేడిగడ్డ బ్యారేజీ అంశంలో విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక వచ్చిన తర్వాత మరమ్మతుల విషయంపై దృష్టిసారిస్తామన్నారు. మరో వారం రోజుల్లో ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ వస్తుందన్నారు.
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ఆనకట్టల డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డీపీఆర్‌లో షీట్ పైల్స్ ఉంటే.. నిర్మాణంలో సీకెంట్ ఫైల్స్ వాడారని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కూలడం సమస్య కాదు.. మేడిగడ్డ డిజైన్ లోనే లోపం ఉందన్నారు. డ్యామ్ మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పారు.
ALSO READ | ఉప ఎన్నికలు వస్తాయో.. రావో కోర్టు చెప్తుంది.. మీరు కాదు: సీఎం వ్యాఖ్యలకు KTR కౌంటర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. ఉమ్మడి ఏపీ కంటే బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. 811టీఎంసీలకు 512 టీఎంసీలు ఆంద్రాకు రాసిచ్చారని విమర్శించారు. తాము వచ్చాకు కృష్ణాబోర్డులో సమస్యను లేవనెత్తామన్నారు ఉత్తమ్.
ఎస్ఎల్ బీసీ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు ఉత్తమ్. ప్రపంచ స్థాయి నిపుణులను భాగస్వామ్యంచేసి సహాయక చర్యలు కొనసాగిస్తామన్నారు.తమ్మడి హట్టి దగ్గర ఆనకట్ట నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.