బచ్చన్నపేట, వెలుగు: కొత్త రేషన్‌కార్డుల జారీ నిర్వహణ సీఎస్సీ డిజిటల్ సెంటర్లకు కేటాయించాలని రాష్ట్ర సీఎస్సీ డిజిటల్ సెంటర్ల ప్రధాన కార్యదర్శి రాపల్లి వెంకటేశ్ పుడ్ అండ్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. శనివారం రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు జ్యోతితో కలిసి హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మంత్రిని శాలువాతో సన్మానించారు. వారి విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ రిప్రజెంటేషన్‌ను మంత్రి ఎండార్స్ చేయగా, సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రెటరీ డీఎస్ చౌహాన్‌కు అందజేశామన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘం నాయకులు నాగరాజు, వినాయ్ తదితరులున్నారు.