నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఉత్తమ్

నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు  మంత్రి కఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో నిర్వహించిన సభలో మంత్రి ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. దేశంలో అత్యధిక మెజార్టీతో నల్గొ్ండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.  నల్గొండ పార్లమెంట్ లో మీ గొంతును వినిపించా...  ఇప్పుడు తన స్థానంలో ఎంపీగా రఘువీర్ ను పంపుదామని పిలుపునిచ్చారు.  ఈ  ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచి పీఎంగా రాహుల్ గాంధీ అవుతారన్నారు. 

 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అవుతాయన్నారు మంత్రి ఉత్తమ్. పార్లమెంట్, అసెంబ్లీలకు బీజేపీ విలువ లేకుండా చేసిందని మండిపడ్డారు.  మే 13న జరగబపోయే ఎన్నికలు.. భారతదేశ దశ దిశను మార్చబోతున్నాయన్నారు. మోదీ రైతాంగాన్ని ఏమి ఆదుకున్నాడని ప్రశ్నించారు.  బీజేపీ విధానాలతో  రైతులకు ఆదాయం  తగ్గి.. ఢిల్లీ రోడ్లపై ఆందోళన చేసే విధంగా మార్చారని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీ ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదని.. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని  రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన  తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్న మంత్రి ఉత్తమ్ ... రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. కార్యకర్తలు అశ్రద్ధ చేయకుండా అందరూ ప్రతి ఇంటికి  తిరిగి ఓట్లు వేయించాలని చెప్పారు.  రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొంటామని తెలిపారాయన.

మిల్లర్లు, అధికార్లు ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చారించారు.  నాగార్జునసాగర్  జలాశయంలో తాను కేటాయించిన ఎయిర్ డ్రోమ్ ను రఘు వీర్ రెడ్డి గెలిచిన తరువాత  దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు ఉత్తమ్.