గోదావరి నదిపై తుమ్మిడిహట్టి దగ్గర రాజశేఖర్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం 16లక్షల ఎకరాల ఆయకట్టుతో రూ.38వేల కోట్లతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే.. కేసీఆర్, దానిని రీడిజైన్ పేరుతో కాళేశ్వరం కట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 94 వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి ఈ ప్రాజెక్టును కేసీఆర్ కట్టారని.. ఇంతఖర్చు చేసినా ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందని...ఇది, కేసీఆర్ పనితనమని విమర్శించారు. కేసీఆర్ బుర్ర కరిగించి కట్టిన మేడిగడ్డ.. మేడిపండు అయ్యిందని మండిపడ్డారు. తానే డిజైన్ చేశానని గొప్పలు చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ, మేడిపండు కాగానే గప్ చుప్ అయ్యారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చూపెట్టాలని మేడిగడ్డకు వచ్చామని మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చుక్క నీరు అందలేదన్నారు. రూ.లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. డిజైన్, నిర్మాణం లోపాలతో ఎందుకు పనికిరాకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రూ.వేల కోట్ల జనం సొమ్ము వృదా అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.